Kondalalo Nelakonna - కొండలలో నెలకొన్న
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు
..
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు
దొమ్ములు సేసిన యట్టి తొండ మాం చక్కుర వర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు
..
అచ్చపు వేడుకతోడ ననంతాళు వారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు
..
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
Kanti Sukravaramu - కంటి శుక్రవారము
కంటి శుక్రవారము గడియ లేడింట - అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని॥
సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి - కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి - తుమ్మెద యైచాయతోన నెమ్మది నుండే స్వామిని॥
పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి - తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై - నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని॥
తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు - పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది - బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని॥
No comments:
Post a Comment