చ ll తగిలి మదంబుచే నెదిరిఁ దన్ను నెఱుంగక దొడ్డ వానితోఁ
బగ గొని పోరుటెల్ల నతి పామరుఁడై చెడు టింతెకాక తా
నెగడి జయింప నేరఁ డది నిక్కము తప్పదు దాత్రి లోపలన్
దెగి యొక కొండతోఁ దగరు దీకొని తాఁకిన నేమి భాస్కరా!46
తా ll మోటుఁ దనము చేత తనబలము ఎదిరి బలము తెలియక పొట్ట
పొగరుచే గొప్ప వానితో పోట్లాడినచో పరాజయము సంభవించును.
ఏలయన ఒకపొట్టేలు కొండతో దీకొనిన యెడల తల పగిలి చచ్చును
కాని , యేమైన విజయమును, లాభమును పొంద గలదా?