HINDU GODDESS PRAYER


ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా | | 1
ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాడ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా | | 2
మనో రూపేక్షు కోదండా, పంచతన్మాత్ర సాయకా |
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా | | 3
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా |
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా | | 4
అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా |
ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా | | 5
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా |
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా | | 6
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా | | 7

WHAT IS BLOOD PRESSURE - HOW TO CONTROL BLOOD PRESSURE - TIPS IN TELUGU FOR B.P. PROTECTION


రక్తపోటు అంటే ఏమిటి? 

ఈ మధ్య కాలంలో చిన్నా లేదు.. పెద్దా లేదు ప్రతి ఒక్కరూ టెన్షన్ తో కూడిన జీవితాలను అనుభవిస్తున్నారు.. అరవైలలో సంపాదించే డబ్బు ఇరవైల్లోనే వస్తే... అరవైయ్యవ ఏట రావాలసిన జబ్బులు ఇరవైల్లోనే వస్తాయా?? మనం జాగ్రత్తగా లేక పోతే వచ్చే అవకాశాలున్నాయి.. అందుకే కొంచెం అవగాహనను పెంచుకోవాలి... 

ప్రపంచంలోని జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నారని ఓ సర్వేలో వెల్లడైoది. ముఖ్యంగా భారతదేశంలోని పట్టణాలలో అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 25శాతంవరకు ఉందని అదే గ్రామాలలో నివసించేవారిలో దాదాపు 10శాతం ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారని సర్వేలో తేలినట్లు లెక్కలు చెబుతున్నాయి.
రక్తపోటు అంటే ఏమిటి?

గుండెనుంచి శరీరం మొత్తానికి రక్తాన్ని చేరవేసే రక్త నాళాలద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. ఆరోగ్యంగా ఉండే మనిషిలో సాధారణ రక్తపోటు 120 ‌ఎమ్ఎమ్‌హెచ్‌జీ సిస్టోలీక్ లేదా 80 ఎమ్ఎమ్‌హెచ్‌జీ డైస్టోలిక్‌గా ఉంటుంది. శరీరం బరువు పెరగడంతో, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, వంశపారంపర్యంగా ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, తదితర కారణాలద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెపుతున్నారు. దీనిని సంపూర్ణంగా నివారించలేము. కాని కొన్ని నియమిత సూత్రాలను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.

సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఉదాహరణకు గోధుమలు, బియ్యం, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, చేపలు, తగినంత ఉప్పు, శరీరానికి తగినంత వ్యాయామంతోపాటు వైద్యుని సలహా మేరకు మందులను తీసుకుంటూ ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే అధిక రక్తపోటును ఖచ్చితంగా అదుపులోకి తీసుకురావచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
పూర్వం సర్వం దైవార్పితం అని ధ్యానం చేసి పని మొదలు పెట్టే వారు... ఒకవేళ సక్సెస్ అయితే దైవ నిర్ణయం గా.. అపజయం ఎదురైతే అది కూడా దైవనిర్ణయంగా భావించేవారు... అందువలన ఎక్కడా ఆందోళనలు దరిచేరేయి కాదు.. ప్రస్తుత సమకాలీన పరిస్థితులలా లేవు.. ఏం చేసినా ఏం అయినా తమ స్వయంకృతం గా చెప్పుకుంటున్నారు.. ఇది సరి కాదు.. మనకు వచ్చే ప్రధాన సమస్యలకు.. ఆందోళనలకు ముఖ్య కారణమిదే... ఏ కార్యం తలపెట్టేటపుడైనా సరే... దైవం మన అండ ఉందనే ధైర్యంతో ముందడుగు వేయాలి... జయించినపుడు పొంగిపోకూడదు.. అపజయం ఎదురైనపుడు కృంగిపోకూడదు.. అపుడు ఏ బి.పి.లు మన చెంత చేరవు..

SRIKALAHASTHESWARA BHAKTHI POEM AND MEANING


శ్రీకాళాహస్తీశ్వరా!
.
రాజై దుష్కృతిచెందె చందురుడు,రా రాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునగాంచె దుఃఖము,కురు క్ష్మాపాలుడామాటనే
యాజింగూలె సమస్త రాజబందువులతో నారాజశబ్దంబు ఛీ, 
ఛీ!జన్మాంతరమందు నొల్లను జుమీ . శ్రీకాళాహస్తీశ్వరా!...(ధూర్జటి.)
.
శ్రీకాళాహస్తీశ్వరా!
రాజైన చంద్రునకు కళంకమేర్పడినది.
రాజుగా దనాదిపతియైన కుబేరునకు దేహము చెడిపోయి దుఃఖించినాడు
.రారాజైన దుర్యోదనుడు యుద్దమునందు బందువులతో కూడ నాశనము చేశాడు.
కావున ఛీ ఛీ నేను ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా 'రాజు'అనే పదాన్నే ఒప్పకొనను.
నీ పాదముల సేవయే నాకు రాజ్య పదవి కంటే మిన్న.
.
పదవులకు ఎగబాకే వారు గుర్తు చేసుకోవలసిన మంచి పద్యం.

Saturday, 18 October 2014

CHOTE KIDS TELUGU RHYMES AND POETRY


ఏడవకు పాపాయి

ఏడిస్తే ఏరుపెక్కు

నీ కన్ను దోయి

కన్నతల్లి మనసు కలత చెందునురా...


బజ్జోరా నా కన్నా లాలీ జోజో జో లాలీ .....లాలీ జో జో..

GODDESS ANNAPURNA DEVI DEVOTIONAL ARTICLE


అన్నేశ్రితాని భూతాని అన్నం ప్రాణమితి శృతిః 
తస్మాదన్నం ప్రదాతవ్యం అన్నం హి పరమం హవిః

అన్నదానాత్పరం దానం సభూతం సభవిష్యని - అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు మనకి బోధిస్తాయ్. అన్నం సర్వజీవాధారం. అటువంటి ఈ అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణే మన దుర్గమ్మ. నిత్యాన్న దానేశ్వరిగా, నిటలాక్షు ని ప్రాణేశ్వరిగా, ఆ తల్లిని ఆకలేసి యాచించిన తన భర్త పరమేశ్వరుడికి అన్నపూర్ణ రూపిణిగా అన్నాన్ని ప్రసాదించింది. అలా అన్నార్తులైన వారందరిని శివస్వరూపులుగా భావించాలి. అలా ఎప్పుడైతే అందరూ భావిస్తారో వారంతా సాక్షాత్తు ఆకలి తీర్చే ఆ అన్నపూర్ణా స్వరూపులే అవుతారు.

The two great enemies for Humans - English Spiritual Article


The two great enemies

Man has two enemies, one being " ahamkara" and the other " mamakara".
Ahamkara causes one to say " I" , " I" while Mamakara gives rise to the feeling of " mine". Whenever some object is perceived , then the feeling, " this is mine ", is due to Mamakara. Likewise, when one does something, the feeling, " I did this", is due to Ahamkara.
There is an incident related to this where his holiness Sri bharathi teertha mahaswami explains.
When swami was once touring in Andhrapradesh, he graced a kshetra. That place, though sacred , had not attracted many pilgrims because it lacked conveniences for the public. One adhikari ( officer) took up the job of rectifying this. He made a lot of arrangements, after which people started visiting the place in large numbers. When acharyal went there, the adhikari kept pointing to things, boasting to swami that everything was his handiwork. Swami remained silent for a while. On coming to the main entrance of the temple, however, he stopped. He looked at the gopuram and asked the adhikari " do you behold this gopuram?"
Adhikari : Yes, I do.
Mahaswami : How high is it?
Adhikari : Very high.
Mahaswami : where are we when compared to it?
Adhikari : On a very low level.
Mahaswami : Do you know why such Gopurams are built? It is to make us realize how insignificant we are so that we can get rid of our Ahamkara. When we think of Ishwara, the creator of this wonderful universe, and look at ourselves, we will realize that what we can achieve is insignificant compared to His magnificent deeds. Therefore, it is meaningless to hold on to ideas such as " I did this".

( from teachings of bharathi teertha mahaswamigal)

TELUGU DEVOTIONAL ARTICLE ABOUT GOD'S CREATION


భగవంతుని స్వరూపం మరియు సృష్టి గురించి భాగవతంలోని ద్వితీయ స్కందంలో శుకమహర్షి పరీక్షిత్మ్హారాజుకు చెప్పాడు.భగవంతుడిని పరమేశ్వరుడని,విరాట్పురుషుడని ఇంకా అనేక పేర్లతో హిందూమతం వర్ణిస్తుంది.భగవంతుడు శాశ్వతుడు అంత్యకాలంలో సృష్టి ఆయనలో లీనమౌతుంది.తిరిగి భగవంతుని నుండి సృష్టి అనేకరూపాలతో ఆయననుండి ఉద్భవిస్తుంది.హిరణ్యమయమైన భగవంతుని శరీరంనుండి ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని మూడు విధాలుగా ఈ జగతిని సృష్టించాడు.పరమాత్మ శరీరంలోని ఆకాశంనుండి ప్రవృత్తి సామర్ధ్యమైన ఓజస్సు,వేగ సామర్ధ్యం,బలసామర్ధ్యం ఉద్భవించాయి.ఆయనలోని సూక్ష్మరూపమైన క్రియాశక్తి వలన ప్రాణం పుట్టింది.ఆ ప్రాణం సమస్త జీవరాశిలో ప్రాణశక్తిగా ఉంది.భగవణ్తుని జఠరాగ్ని నుండి ఆకలి దప్పిక పుట్టాయి.పరమాత్ముని ముఖంనుండి నోరు,నాలుక,దవడలు పుట్టుకొచ్చాయి.నాలుక నుండి రసేంద్రియాలు ఉద్భవించాయి.ఆయన ముఖం నుండి వాగేంద్రియం పుట్టింది.వాగేంద్రియానికి అగ్ని దేవుడు అధిష్టాన దేవత అయ్యాడు.వాగేంద్రియం నుండి సంభాషించే శక్తి పుట్టింది.ఆయనలోని వాయు శక్తి నుండి ఘ్రాణేంద్రియం పుట్టింది.ప్రాణులకు వాసనా శక్తి వచ్చింది.ఘ్రాణేంద్రియానికి వాయువు అధిష్టాన దేవత అయ్యాడు.పరమాత్మ ఆత్మను అవలోకించగానే నేరాలు పుట్టాయి.నేత్రాల నుండి చూసే శక్తి వచ్చింది.నేత్రాలకు సూర్యుడు అధిదేవత అయ్యాడు.దిక్కులు అధిష్టాన దేవతగా కర్ణేంద్రియాలు పుట్టాయి.పరమాత్మ నుండి చర్మం పుట్టింది .దానికి స్పర్శా శక్తి వచ్చింది.చర్మం నుండి వెంట్రుకలు పుట్టాయి.వాటికి వృక్షాలు అధిదేవతలయ్యాయి.ఆ త్ర్వాత వాయువు నుండి చేతులు ఉద్భవించాయి వాటికి ఇంద్రుడు అధి దేవత అయ్యాడు.ఆ తరువాత పాదాలు పుట్టాయి.పాదాలకు విష్ణువు అధిదేవత అయ్యాడు.పరమాత్మఆనందపారవశ్యుడు కాగానే జననేంద్రియాలు పుట్టాయి.జననేంద్రియాల నుండి పునరుత్పత్తి శక్తి ఆవిర్భవించింది.జననేంద్రియాలకు ప్రజాపతి అధిష్టాన దేవత అయ్యాడు.మిత్రుడు అధిష్టాన దేవతగా పాయువు పుట్టింది.దానికి నిస్సార పదార్ధాలను విసర్జించే శక్తి పుట్టింది.జీర్ణమైన శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని స్వీకరించాలన్నప్పుడు మొదటి శరీరాన్ని వదలటానికి సాధనంగా బొడ్డు ఉపయోగపడుతుంది.ప్రాణ ఆపాన వాయువులు శరీరాన్ని వదిలి వేయగానే మృత్యువు సంభవిస్తుంది.క్రింది శరీరాన్ని పై శ్రీరాన్ని వేరు చేస్తూ మధ్య భాగంలో బొడ్డు ఉంటుంది.ఆ హారాన్ని జీర్ణం చేయడానికి ప్రేవులు,రక్తప్రసరణ ఇతర కార్యాలకు నాడీ వ్యవస్థ అవతరించాయి.వాటికి నదీ నదములు అధిష్టాన దేవతలు అయ్యాయి.పరమాత్మ ఒకసారి మాయను ధ్యానించగానే కామానికి,సంకల్పానికి నెలవైన హృదయం జనించింది.హృదయం నుండి సంకల్పం,బుద్ధి,చంద్రుడు,కాముడు జనించాయి.విరాట్పురుషుడి స్థూల శరీరం భూమి తేజస్సు,వాయువు,ఆకాశం,అహంకారం,మహత్తత్వం,అవ్యక్తం అనే ఎనిమిది అనే ఎనిమిది ఆవరణలతో ప్రకాశిస్తుంది.ఇలా శుకమహర్షి పరీక్షిత్తు భాగవతంలో భగంతుని గురించి సృష్టి గురించి వివరించాడు.

STORY OF SIVAM AND CHANDRAM IN TELUGU


రాధామోహనపురంలో శివం, చంద్రం అనే యువకులు ఆకతాయి పనులతో కాలం గడుపుతుండే వారు. ఊరిలో వారంతా వారి దుష్టపనులకి అసహ్యించుకునే వారు. ఎందరో ఎన్ని విధాల వారి ప్రవర్తనలో మార్పు తీసుకొని రావాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 

ఒక పర్యాయం పుండరీకుడు అనే స్వామీజీతీర్థయాత్రలు ముగించుకొని ఆ ఊరి రామాలయంలో శిష్యులతో బసచేసి ప్రతిదినం ప్రవచనాలు ప్రసంగించడం మొదలు పెట్టారు. భక్తులు వారి ప్రవచనాలు వింటూ ఎంతో తన్మయం చెందుతుండేవారు.

ఈవిషయం శివం, చంద్రం చెవిన పడి వారు ఎలా అయినా స్వామీజీని నలుగురిలో పరాభవించాలని నిశ్చయించుకున్నారు. శివం కొంత గడ్డిని, చంద్రం కొంత మట్టి ముద్దని తీసుకొని బయలుదేరి స్వామీజీ ప్రసంగించే ఆవరణ మూకలో కూర్చొని ప్రసంగం వినసాగారు.

స్వామీజీ ప్రవచనాలు సందర్భంలో “ఈ సువిశాల ప్రపంచంలో భగవంతుడు సృష్టించిన అన్నింటికీ ఒక విలువ అంటూ ఉనది” అని వివరించారు.

అదే మంచి తరుణంగా భావించిన శివం, చంద్రం, వారు కూర్చున్నచోటునుంచి లేచి స్వామీజీతో “చేతిలోని గడ్డిని, మట్టిముద్దను చూపించి “మరి వీటి వెఇలువ ఎంతో తెలియజేయగలరా?” అన్నారు స్వామీజీని పరాభవించాలన్న తలంపుతో.

మూకలో కూర్చున్న వారంతా ఆశ్చర్యపోయారు. మరికొందరు వారికి దేహశుద్ధి చేయడానికి ముందుకు ఉరికారు. స్వామీజీ వారిని నివారించి మనిషి కోపతాపాలతో జయించగలిగినది ఏదీ ఉండదు. మీరలా చూస్తూ ఉండండి – అని గడ్డిని చేత్తో విసిరివేశారు. వెంటనే అక్కడ నెమరు వేసుకుంటున్న ఆవు కంటపడి ఆ గడ్డిని తినివేసింది. స్వామీజీ మట్టిముద్దను తీసుకొని చక్కగా ఒక లింగాన్ని తీర్చిదిద్ది అక్కడ ఉన్న పాలతో అభిషేకం జరిపి తలా కొంత పాలు తీర్థంగా పంచిపెట్టారు. అందరితో పాటు శివం, చంద్రం కూడా పాలు పుచ్చుకున్నారు. స్వామీజీ – “గడ్డితినే ఆవుపాలు భగవంతునికి చేసే అభిషేకంలో అవసరం పడుతుంటాయి. ఇహపోతే నెవు తెచ్చిన మట్టిముద్దను లింగ రూపంగా తీర్చిదిద్దడం వలన ఆ శంకరునే తలంచుకుంటూ భక్తులు ఆరాధిస్తున్నారు!” అన్నారు.
చంద్రం, శివం ఒక్క ఊపున స్వామీజీ కాళ్లమీద పడి “మమ్మల్ని క్షమించండి స్వామీ!” అన్నారు పశ్చాత్తాపంతో. స్వామీజీ వారిని నిండు మనస్సుతో ఆశీర్వదించారు.

namo venkatesa


స్వామీ! నీ పాదధూళిచే పవిత్రమైనవారు 
వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. 
స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు 
మార్గములో నీ గుడి గోపురముల
శిఖరములను చూచి ఆనందపరవశులై 
మనుష్యులుగా భూలోకమునందే
మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు.
ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.