Friday, 31 October 2014

WHAT IS BLOOD PRESSURE - HOW TO CONTROL BLOOD PRESSURE - TIPS IN TELUGU FOR B.P. PROTECTION


రక్తపోటు అంటే ఏమిటి? 

ఈ మధ్య కాలంలో చిన్నా లేదు.. పెద్దా లేదు ప్రతి ఒక్కరూ టెన్షన్ తో కూడిన జీవితాలను అనుభవిస్తున్నారు.. అరవైలలో సంపాదించే డబ్బు ఇరవైల్లోనే వస్తే... అరవైయ్యవ ఏట రావాలసిన జబ్బులు ఇరవైల్లోనే వస్తాయా?? మనం జాగ్రత్తగా లేక పోతే వచ్చే అవకాశాలున్నాయి.. అందుకే కొంచెం అవగాహనను పెంచుకోవాలి... 

ప్రపంచంలోని జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నారని ఓ సర్వేలో వెల్లడైoది. ముఖ్యంగా భారతదేశంలోని పట్టణాలలో అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 25శాతంవరకు ఉందని అదే గ్రామాలలో నివసించేవారిలో దాదాపు 10శాతం ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారని సర్వేలో తేలినట్లు లెక్కలు చెబుతున్నాయి.
రక్తపోటు అంటే ఏమిటి?

గుండెనుంచి శరీరం మొత్తానికి రక్తాన్ని చేరవేసే రక్త నాళాలద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. ఆరోగ్యంగా ఉండే మనిషిలో సాధారణ రక్తపోటు 120 ‌ఎమ్ఎమ్‌హెచ్‌జీ సిస్టోలీక్ లేదా 80 ఎమ్ఎమ్‌హెచ్‌జీ డైస్టోలిక్‌గా ఉంటుంది. శరీరం బరువు పెరగడంతో, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, వంశపారంపర్యంగా ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, తదితర కారణాలద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెపుతున్నారు. దీనిని సంపూర్ణంగా నివారించలేము. కాని కొన్ని నియమిత సూత్రాలను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.

సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఉదాహరణకు గోధుమలు, బియ్యం, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, చేపలు, తగినంత ఉప్పు, శరీరానికి తగినంత వ్యాయామంతోపాటు వైద్యుని సలహా మేరకు మందులను తీసుకుంటూ ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే అధిక రక్తపోటును ఖచ్చితంగా అదుపులోకి తీసుకురావచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
పూర్వం సర్వం దైవార్పితం అని ధ్యానం చేసి పని మొదలు పెట్టే వారు... ఒకవేళ సక్సెస్ అయితే దైవ నిర్ణయం గా.. అపజయం ఎదురైతే అది కూడా దైవనిర్ణయంగా భావించేవారు... అందువలన ఎక్కడా ఆందోళనలు దరిచేరేయి కాదు.. ప్రస్తుత సమకాలీన పరిస్థితులలా లేవు.. ఏం చేసినా ఏం అయినా తమ స్వయంకృతం గా చెప్పుకుంటున్నారు.. ఇది సరి కాదు.. మనకు వచ్చే ప్రధాన సమస్యలకు.. ఆందోళనలకు ముఖ్య కారణమిదే... ఏ కార్యం తలపెట్టేటపుడైనా సరే... దైవం మన అండ ఉందనే ధైర్యంతో ముందడుగు వేయాలి... జయించినపుడు పొంగిపోకూడదు.. అపజయం ఎదురైనపుడు కృంగిపోకూడదు.. అపుడు ఏ బి.పి.లు మన చెంత చేరవు..

No comments:

Post a Comment