శ్రీకాళాహస్తీశ్వరా!
.
రాజై దుష్కృతిచెందె చందురుడు,రా రాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునగాంచె దుఃఖము,కురు క్ష్మాపాలుడామాటనే
యాజింగూలె సమస్త రాజబందువులతో నారాజశబ్దంబు ఛీ,
ఛీ!జన్మాంతరమందు నొల్లను జుమీ . శ్రీకాళాహస్తీశ్వరా!...(ధూర ్జటి.)
.
శ్రీకాళాహస్తీశ్వరా!
రాజైన చంద్రునకు కళంకమేర్పడినది.
రాజుగా దనాదిపతియైన కుబేరునకు దేహము చెడిపోయి దుఃఖించినాడు
.రారాజైన దుర్యోదనుడు యుద్దమునందు బందువులతో కూడ నాశనము చేశాడు.
కావున ఛీ ఛీ నేను ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా 'రాజు'అనే పదాన్నే ఒప్పకొనను.
నీ పాదముల సేవయే నాకు రాజ్య పదవి కంటే మిన్న.
.
పదవులకు ఎగబాకే వారు గుర్తు చేసుకోవలసిన మంచి పద్యం.
.
రాజై దుష్కృతిచెందె చందురుడు,రా రాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునగాంచె దుఃఖము,కురు క్ష్మాపాలుడామాటనే
యాజింగూలె సమస్త రాజబందువులతో నారాజశబ్దంబు ఛీ,
ఛీ!జన్మాంతరమందు నొల్లను జుమీ . శ్రీకాళాహస్తీశ్వరా!...(ధూర
.
శ్రీకాళాహస్తీశ్వరా!
రాజైన చంద్రునకు కళంకమేర్పడినది.
రాజుగా దనాదిపతియైన కుబేరునకు దేహము చెడిపోయి దుఃఖించినాడు
.రారాజైన దుర్యోదనుడు యుద్దమునందు బందువులతో కూడ నాశనము చేశాడు.
కావున ఛీ ఛీ నేను ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా 'రాజు'అనే పదాన్నే ఒప్పకొనను.
నీ పాదముల సేవయే నాకు రాజ్య పదవి కంటే మిన్న.
.
పదవులకు ఎగబాకే వారు గుర్తు చేసుకోవలసిన మంచి పద్యం.
No comments:
Post a Comment