అనగా అనగా ఇద్దరు రాణులు ఉండేవారట. పెద్ద రాణికి ఒక అమ్మాయి పుట్టిందట. చిన్న రాణికి ఇది ఇష్టం లేదట. అందుకని ఆ పాపని పుట్టిన వెంటనే దాసీకి ఇచ్చేసిందట. పెద్దరాణితో, ''నీకు కప్ప పిల్ల పుట్టింది'' అని చెప్పిందట. పెద్ద రాణి, ''అయ్యో !ఇది నాకర్మ!'' అనుకుని ఏడుస్తూ ఊరుకుందిట. తరువాత చిన్న రాణికి కూడా ఒక అమ్మాయి పుట్టిందట. ఇలా కొంతకాలం సాగిందట. పెద్దరాణి కూతురు దాసీ దాని ఇంటిలో నూ, చిన్న రాణి కూతురు రాజుగారింటిలోనూ పెరుగుతున్నారట. చిన్న రాణి పెద్దమ్మాయి చేత దాసీ పనులు చేయిస్తూ, చాలా కష్టాలు పెడుతూ ఉంటుందిట. చిన్నమ్మాయికి, అంటే చిన్న రాణీ గారి సొంత కూతురికి అది అస్సలు బాగుండదట. మరేమో, ఆ అమ్మాయికి తనకిది నచ్చలేదని వాళ్ళ అమ్మతో చెప్పాలంటే భయమట. అందుకని ఒక ఉపాయం ఆలోచించిందట. ఒక రోజు ఆ చిన్న మ్మాయి బొమ్మలతో అమ్మ ఆట ఆడుకుంటోందిట. ఎంచక్కా అమ్మ లాగే తను కూడా వంట చేసి, ఆ బొమ్మకి, ''తిను, తిను'' అంటూ తినబెట్టిందట. కానీ ఆ బొమ్మేమో తినలేదు కదా. అప్పుడు ఆ అమ్మాయేమో, ''నా బొమ్మ బువ్వ తినటం లేదూ'' అంటూ ఏడవటం మొదలెట్టిందట.
వాళ్ళమ్మ అది చూసి, ''చిలకల కొలికీ చినదానా, బొమ్మలు బువ్వ లు తిందురటే'' అందిట నవ్వుతూ. అప్పుడేమో ఆ అమ్మాయి, ''మాయలదానా, మహిమల దానా, మనుషులు కప్పల కందురటే'' అందిట చమ త్కారంగా. అప్పుడు చిన్న రాణి తను చేసిన తప్పు తెలుసుకుని, పెద్దరాణికి నిజం చెప్పి, పెద్దమ్మాయిని పిలుచుకుని వచ్చి, ప్రేమగా చూసుకోసాగిందట''
No comments:
Post a Comment