Monday, 1 February 2016

AVAILABILITY OF PROTEINS AND VITAMINS IN FOOD STUFF


మాంసకృత్తులు (ప్రోటీన్స్)

మాంసకృత్తులు మన శరీరానికి కావలసిన ఘన పోషకాలు. కండరాలు ఏర్పాటుకు, వాటి కణజాలాల ఎదుగుదలకు, నిర్వహణకు, మరమ్మత్తులకు ఇవి తప్పనిసరి. ఇవి ఎన్నో జీవక్రియలకు తోడ్పడుతాయి. మనలో ఉండే అధిక మాంసకృత్తులను శరీరం జీవక్రియలను జరపడానికి శక్తిగా ఉపయోగించుకుంటుంది. మాంసకృత్తులు మన శరీరంలో 50% కణజాలంలో, 20% ఎముకలలో, 10% చర్మంలో, మిగిలినది ఇతర అవయవాలలో ఉంటాయి.
మాంసకృత్తులు ఎన్నో అమైనో ఆమ్లాల సమీకృతం. అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి బంధాలను ఎర్పరచుకొని సమూహంగా మారి మాంసకృత్తులను ఏర్పరుస్తుంది. మన శరీరంలో ఇరవై రకాల అమైనో ఆమ్లాలు మాంసకృత్తుల ఉత్పత్తికి తోడ్పడుతాయి.
మాంసకృత్తుల విభజన
సంపూర్ణ మాంసకృత్తులు: అన్ని ఆవశ్యక అమైనో ఆమ్లాలు కలిగిన మాంసకృత్తులు. ఇవి పెరుగుదలకు తోడ్పడుతాయి
ఉదాహరణ: కోడిగ్రుడ్డు. గ్రుడ్డులో ఉండే మాంసకృత్తులను రిఫరెన్స్ ప్రోటిన్ అని అంటారు. ఇందులో 100% గుణవంతమైన మాంసకృత్తులు ఉంటాయి. దీనితో పోలిస్తే శాఖాహారంలో 65% మాంసకృత్తులు మాత్రమే ఉంటాయి.
ఆవశ్యక అమైనో ఆమ్లాలు
ఇవి మన శరీరంలో తయారుకావు. కాని శరీర పెరుగుదల మరియు నిర్వహణకు ఇవి అవసరం. తప్పనిసరిగా ఆహారం ద్వారా సమకూర్చుకోవలసిందే.
ఆవశ్యక అమైనో ఆమ్లాల గల ఆహార పదార్థాలు: పాలు, గుడ్డు, చేపలు, సోయా చిక్కుళ్ళు, మాంసం, ఆకుకూరలు, వేరుశనగలు, ధాన్యాలు, చిరుధాన్యాలు. 
విధులు: మన శరీరంలో జరిగే ప్రతి జీవరసాయన చర్య మాంసకృత్తుల ఎంజైం వల్ల ప్రేరేపించబడుతుంది. శరీరంలో అన్ని నిర్మాణ కణజాలాలు మాంసకృత్తులని కలిగి ఉంటాయి. అందువల్ల శరీరానికి మాంసకృత్తులు అత్యవసరమైనవిగా చెప్పవచ్చు.
పెరుగుదల మరియు కణజాల నిర్వహణ: శరీరంలో కొత్త కణాల ఏర్పాటుకు, వాటి పెరుగుదలకు ఆమైనో ఆమ్లాల మిశ్రమం ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఆమైనో ఆమ్లాల మిశ్రమం సరైన మోతాదులో ఉన్నపుడు ఈ విధి జరుగుతుంది

No comments:

Post a Comment