Friday, 1 August 2014

BEAUTIFUL RADHE AND KRISHNA TELUGU LOVE POETRY


నిన్న నాది అలకనే 
అదీ కొంచమే... 

గారడీ చేసే క్రిష్ణయ్యవేగా
అందుకే కవ్వింపు తెలుసు
అలక తీర్చే వైనమూ తెలుసు

ఈ రాధను పొగిడి
అల్లరి చేసి, అలక తీర్చి
మనసు పలికే మధుర గేయాన్ని మీటి
వద్దకొచ్చేస్తాను...సరసాన్ని నేర్పుతాను అంటే.....

ఎలా ఓపనమ్మా!
పులకించిన వయ్యారాలను
గిలిగింతల ప్రణయ గమకాలను.

నిన్నసంధ్య లో నేను మూభావమయితే
నేడు నీ పలుకులు నాతో గుసగుసలాడి
నీవు అల్లరి నగువులు చిలికి
నీ ఆశలని నాతో పంచుతుంటే.....

ఎలా తట్టుకోవలమ్మా!
ఈ మనోహరుడి ప్రేమ పాశం

ఎలా అదుపుకోవలమ్మ!
నీవు తడిమిన మానస మధు కలశం.

No comments:

Post a Comment