Unknown facts about Indian History




ఇప్పుడు మనం చిత్రంలో చూస్తున్నది.. హిందు కుష్ పర్వతం యొక్క సాటిలైట్ చిత్రం... ఇది ఓంకారమునకు చిహ్నంలా ఉంది కదా.. 

కానీ హిందు కుష్ అనే పదానికి అర్థం తెలుసుకుంటే చాలా బాధ కలగటం ఖాయం  

.. హిందు కుష్ అంటే హిందువులను ఊచకోత కోయబడిన స్థలమని అర్థం.. 

క్రీ.శ 1000 వరకు అది మన భారత భూభాగంలో ఒక భాగంగానే ఉండేది... చంద్రగుప్తుల పాలన తర్వాత అది గ్రీకుల ఆధీనంలోకి వెళ్ళింది.. ఆ సమయంలో బౌద్ధం మన పౌరుషాలను హరించిందనే చెప్పాలి... సన్యాసత్వం వేరే మతాలవారు మనను ఆధీనంలోకి తీసుకెళ్ళేలా చేసింది అని కూడా చెప్పవచ్చేమో... అప్ఘనిస్తాన్ లో ఉన్న ఈ ప్రాంతం నుండి కొన్ని వేల మంది హిందూ బానిసలను ఆప్ఘనిస్తాన్ లోని ఈ ప్రాంతంలో ఊచకోత కోసారని వికీపీడియాలో మనం చూడవచ్చు... ఏ పాఠ్య పుస్తకంలోనూ చివరకు ఏ చరిత్ర పుస్తకంలోనూ మనం ఈ చరిత్రను చదవలేం.. యూదుల అరాచకాలను గురించి పాలస్తీనా పుస్తకాలలో, అమెరికాచరిత్రలో, చివరికి జర్మనీ లో కూడా ప్రచురితమయ్యాయి.. కానీ మన వాస్తవ చరిత్రను మాత్రం మనకు తెలియకుండా చేస్తున్నారు.. హిందుకుష్ పర్వతాలంటే మానవకంకాళాలనిలయమని అర్థమని తెలుసుకుంటే చాలా బాధగా ఉంది..

SAMBA SADA SIVA SAMBA SADA SIVA SAMBA SADA SIVA SAMBA SIVA


మన్మధ నాశన మధుపాన ప్రియ మందర పర్వత వాస శివ
యతి జన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్యాది సురేశ శివ
రామేశ్వర రమణీయ ముఖాంభుజ సోమ శేఖర సుకృతి శివ
లంకాదీశ్వర సుర గణ సేవిత లావణ్యా మృత లసిత శివ
వరదా భయకర వాసుకి భూషణ వన మాలాది విభూష శివ
శాంతి స్వరూప జగత్త్రయ చిన్మయ కాంతి మతి ప్రియ కనక శివ
షణ్ముఖ జనక సురేంద్ర ముని ప్రియ షాడ్గుణ్యాది సమేత శివ
సంసారార్ణవ నాశన శాశ్వత సాధు హృది ప్రియ వాస శివ
హర పురుషోత్తమ అద్వైతామృత పూర్ణ మురారి సుసేవ్య శివ
ళాళిత భక్త జనేశ నిజేశ్వర కాళీ నటేశ్వర కామ శివ
క్షర రూపాది ప్రియాన్విత సుందర సాక్షి జగత్రయ స్వామి శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

MONDAY PRAYER TO LORD SIVA


సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం ...

1. ఓం నమఃశివాయ - పoచాక్షరి మంత్రం .
'న'కారం -బ్రహ్మ యొక్క భూమి
'మ'కారం-విష్ణు మూర్తి యొక్క వాయువు
'శి 'కారం -రుద్రుని అగ్ని
'వా 'కారం -మహేశ్వరుని వాయువు
'య 'కారం -సదాశివుని ఆకాశం
ఈ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే త్రిముర్తులతో పాటు పంచభూతాలను స్మరించినట్టు .

THE POWER OF SOUND OF LORD RAMA AND IMPORTANCE OF THE NAME OF LORD SRI RAMA IN TELUGU


 "రామ" శబ్దము

బ్రహ్మదేవుడు 'నారాయణ' శబ్దం లోని రెండవ అక్షరమైన 'రా'ను నమశ్శివాయ శబ్దములోని రెండవ అక్షరమైన 'మ ' ను తీసుకొని రామ అను శబ్దమును సృష్టించి, సరస్వతీదేవికి చెప్పాడు. ఈ రామనామము మహా మహిమాన్వితమైనదనీ, రామనామం ఉఛ్ఛరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందనీ, ముక్తిదాయకమని చెప్పాడు. ప్రక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు. జాగ్రత్తగా విన్నాడు. ఇకనేం! బ్రహ్మ లోకం నుండి భూలోకం వచ్చాడు. ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు. ఒక బోయవాడు తటస్థపడ్డాడు. అతని చరిత్రంతా దివ్య దృష్టితో క్షణంలో గ్రహించాడు. అతడు హింసాయుత కర్మాచరణలో ఉన్నాడు. అపమార్గంలో నడుస్తున్నాడు. అతడిని ఈ మార్గంనుంచి తప్పించి ఉన్నత మార్గానికి చేర్చాలి అనుకొన్నాడు. "రామ" అను శబ్దమును ఉపదేశించాడు. పట్టుదలతో జపించమన్నాడు. బోయవాడు శ్రద్దతో విన్నాడు. అదేపనిగా మనసులో స్మరిచుకుంటూ, కొంతసేపు, మరికొంతసేపు ఉచ్చరిస్తూ అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు.
రోజులు గడుస్తున్నాయి. తనపట్టుదలను వదలలేదు. ధృఢచిత్తంతో అలానే ఉన్నాడు. చుట్టూ పుట్ట వెలసింది. చిక్కిశల్యమయ్యాడు. పుట్టాకోనలనుండి, దివ్యకాంతులు ప్రసరిల్లుతున్నాయి. రామనామము విపడుచున్నది. సంవత్సరాలు గడిచాయి. పుట్టకొనలనుండి వస్తున్న "రామ" నామము బ్రహ్మలోకము చేరుకొన్నది. బ్రహ్మ సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు. పుట్టపై తన క్రుపారస ద్రుష్టిని ప్రసరింపచేశాడు. పుట్టలోనుండి బంగారు వన్నెచాయతో గల మేనితో, తెల్లని గడ్డముతో, జడలతో ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో దండముతో, ఙ్ఞానజ్యోతి రూపు దాల్చాడా అన్నాట్లు ఒక మహర్షి లేచి వచ్చి బ్రహ్మదేవునకు నమస్కరించాడు."నీవు వల్మీకము (పుట్ట)నుంచి లేచివచ్చావు కనుక ఇకనుండి "వాల్మీకి" అను పేరుతో పిలువబడతావు. నీవలన ఒక మహత్కార్యము నెరవేరుతుంది. అది రామాయణ కావ్య రచన. ఈ కావ్య రచనవలన లోకములో రామనామము వ్యాప్తి చెందుతుంది. సర్వమానవాళికి రామనామము సధ్గతిని కలిగిస్తుంది. కనుక రామాయణము రచింపుమని ఆదేశించాడు. వాల్మీకి మహర్షి రామాయణమును రచించాడు. అందులో గాయత్రీ మంత్రమును నిషిప్తంచేశాడు. ఈ కావ్యంలో ఎదొక చెప్పుకోదగిన విశేషము- ఇంకా అనేకం వున్నాయి.విష్ణు సహస్ర నామాలు పఠిస్తే దుస్వప్నములు రావు. అశుభములు కలుగవు. ధర్మార్ధ కామ మోక్షాలు కలుగుతాయి. అనారోగ్యములు కలుగవు. బంధనముల నుండి విముక్తులవుతారు. ఆపదలు సంభవించవు. ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇన్ని ప్రయోజనాలు సులభంగా పొందడానికి ఏదేని ఉపాయం ఉన్నదా? అని పార్వతీ దేవి శివుడిని అడిగినది.- శివుడు సులభంగా పొందడానికి ఉపాయం ఉన్నది, అది-
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.
రామ అనే శబ్ధం ఒకసారి పటిస్తే విష్ణుసహస్రనామాలు ఒకసారి పఠించిన దానితో సమానము- కనుక రామనామము అంత విశిష్టమైనది, అన్నినామములలోకెల్లా శ్రేష్ఠమైనదనీ అన్నాడు.
మనభారతీయులు వ్రాయడానికి ముందుగా 'రామ' వ్రాసి ప్రారంభిస్తారు. కొందరు భక్తులు రామనామం ఉచ్చరిస్తూ రామకోటి వ్రాస్తారు. అటువంటివారికి సర్వశుభములు కలుగును. వారికి శ్రీరామరక్ష.

FIFTEEN NAMES OF GODDESS SRI SARASWATHI DEVI IN TELUGU AND ENGLISH


సరస్వతీదేవి ఇతర నామాలు

NAMES OF GODDESS SRI SARASWATHI DEVI

సరస్వతీదేవి పలు నామాలతో విలసిల్లుతోంది.
01. భారతి,  BHARATHI
02. మహవిద్య,  MAHAVIDYA
03. వాక్,  VAKH
04. మహరాణి, MAHARANI
05. ఆర్య, ARYA
06. బ్రహ్మి, BRAHMI
07. కామధేను, KAMADHENU
08. బీజగర్భ, BEEJAGARBA
09. వీణాపాణి,  VEENAPANI
10. శారద, SARADHA
11. వాగీశ్వరీ, VAGESWARI
12. గాయత్రి, GAYATHRI
13. వాణి, VANI
14. వాగ్దేవి, VAGHDEVI
15. విద్యావాచస్పతి VIDYAVACHASPATHI

తదితర నామాలు ఉన్నాయి.